లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన పేదలకు 1000 రూపాయలను పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసింది. 1.33 కోట్ల తెల్లరేషన్ కార్డుదారులకు 1330 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ప్రతి తెల్లరేషన్ కార్డుదారుడికి 1000 రూపాయలు అందజేయాలనే సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు గ్రామ వాలంటీర్లు ఉదయం 7 గంటల నుంచే ఇంటింటికే నగదు పంపిణీ మెుదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 6 గంటల వరకు 57.91 శాతం నగదు పంపీణీ జరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 77 లక్షల తెల్లరేషన్ కార్డుదారులకు నగదు పంపిణీ చేసినట్లు సర్కారు వెల్లడించింది. నగదు పంపిణీలో రాష్ట్రవ్యాప్తంగా 15001 సచివాలయ పరిధిలో 2 లక్షల 39 నేవ 159 మంది వార్డు వాలంటీర్లు పాల్గొన్నారని స్పష్టం చేసింది.
57 శాతం ఆర్ధిక సాయం పంపిణీ పూర్తి: ప్రభుత్వం - ఏపీలో 57 శాతం పూర్తైన ఆర్థిక సాయం పంపిణీ
పేదల ప్రజలకు ప్రభుత్వం అందిస్తానన్న 1000 రూపాయల ఆర్థిక సాయం ప్రారంభమయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 57 శాతం పంపిణీ పూర్తయ్యినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
పేదలకు ఆర్థిక సాయం