సచివాలయంలో బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక శాఖ సమావేశం నిర్వహించింది. వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ శాఖలు ప్రతిపాదనలు చేశాయి. జలవనరులశాఖ, రవాణాశాఖ, గనులు, వ్యవసాయం, వైద్యారోగ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఇంధనశాఖలతో పాటు, ప్రణాళిక, పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఐటీ తదితర శాఖల ఉన్నతాధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రులతో భేటీ కానుంది. బడ్జెట్ తుదిమెరుగుల కోసం మంత్రులతోనూ ఆర్థిక శాఖ సమావేశం కానుంది.
బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక శాఖ సమావేశం - AP Finance Ministry Latest news
బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక శాఖ సమావేశం నిర్వహించింది. వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసింది.
Finance Ministry meeting on budget formulation
Last Updated : Feb 3, 2021, 4:58 PM IST