ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీ ప్రభుత్వ డిమాండ్లపై ఆలోచిస్తాం: కేంద్ర ఆర్థికమంత్రి - కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వార్తలు

14వ ఆర్థిక సంఘం నిధులనేవి ముగిసిన అధ్యాయమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఏపీ ఆర్థిక మంత్రికి తెలిపామన్నారు.

Finance Minister
Finance Minister

By

Published : Oct 7, 2020, 7:30 PM IST

కొవిడ్ అనంతరం ఆర్థిక వ్యవస్థ మెరుగయ్యే సూచనలు కన్పిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమలతో ఆర్థికశాఖ నిరంతరం సంప్రదిస్తోందని వెల్లడించారు. జీఎస్టీ పరిహారంపై మరోమారు ఈ నెల 22 తేదీన సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఐదేళ్లకే పరిమితమైన పరిహారాన్ని ఆ తర్వాత కూడా కొనసాగించాలని నిర్ణయించామని చెప్పారు.

14వ ఆర్థిక సంఘం నిధులనేవి ముగిసిన అధ్యాయమని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గనకు తెలిపామని వివరించారు. 15వ ఆర్థిక సంఘం అమల్లోకి వచ్చి ఏడాది అయ్యిందని... 14వ ఆర్థిక సంఘం నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లపై ఆలోచిస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details