ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రుణాల మంజూరుపై రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి సమీక్ష - loans for agriculture sector

2020-21 ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకూ కేటాయించిన రుణాలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. 2020 డిసెంబరు నెలాఖరు వరకూ వివిధ బ్యాంకులు సాధించిన వార్షిక ప్రణాళికల లక్ష్యాలపై మంత్రి సమీక్షించారు.

finance minister buggana rajendranath
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

By

Published : Mar 22, 2021, 8:35 PM IST

రాష్ట్రంలో ప్రాధాన్యేతర రంగానికి 77 వేల 763 కోట్ల రుణాల్ని అందించినట్టు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. వాస్తవానికి ఈ రంగానికి అందించాల్సిన లక్ష్యం 64 వేల కోట్లు మాత్రమేనని.. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 121 శాతం మేర రుణ లక్ష్యాన్ని చేరుకున్నట్టు ఎస్ఎల్​బీసీ సమావేశంలో బ్యాంకర్లు వివరించారు.

సచివాలయంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన 214వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. 2020 డిసెంబరు నెలాఖరు వరకూ వివిధ బ్యాంకులు సాధించిన వార్షిక ప్రణాళికల లక్ష్యాలపై మంత్రి సమీక్షించారు. ప్రాధాన్యతా రంగం కింద 1 లక్షా 87వేల 550 కోట్ల రూపాయల రుణాలకు గానూ లక్షా 53వేల 474 లక్షలు మాత్రమే పంపిణీ చేసినట్టు బ్యాంకర్లు వెల్లడించారు. డిసెంబరు 2020నాటికి 81.83 శాతం లక్ష్యాన్ని మాత్రమే చేరినట్టు బ్యాంకర్లు పేర్కోన్నారు. వ్యవసాయ రంగానికి లక్షా 28వేల 660 కోట్లు ఇవ్వాల్సి ఉంటే.. లక్షా 12వేల 228కోట్లు అందించినట్టు వివరించారు. సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 39వేల 600 కోట్లుకుగానూ 33వేల 424 కోట్లు ఇచ్చినట్టు బ్యాంకర్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details