ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

GST Council Meeting: చేనేత కార్మికులకు ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి: మంత్రి బుగ్గన

Finance Minister Buggana: చేనేత కార్మికులకు ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి బుగ్గన అన్నారు. సరైన అధ్యయనం చేశాకే జీఎస్టీ విధింపుపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

Finance Minister Buggana
Finance Minister Buggana

By

Published : Dec 31, 2021, 3:16 PM IST

Finance Minister Buggana: వస్త్ర, చేనేత రంగాలపై ఆధారపడిన వారికి ఊరటనిస్తూ జీఎస్టీ మండలి కీలక నిర్ణయం వెల్లడించింది. రేపటి నుంచి అమలులోకి రావాల్సి ఉన్న జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసింది. వస్త్రాలపై జీఎస్టీ పెంపును పలు రాష్ట్రాల వ్యతిరేకించగా.. రాష్ట్రం కూడా ఇదే నిర్ణయాన్ని జీఎస్టీ మండలికి స్పష్టం చేసిందని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. సరైన అధ్యయనం చేశాకే జీఎస్టీ విధించాలని చెప్పామన్నారు. రాష్ట్రంలో 3 లక్షల మంది చేనేతపై ఆధారపడి ఉన్నారని... వారికి ఇబ్బంది లేకుండా భవిష్యత్‌ నిర్ణయాలు ఉండాలని చెప్పామన్నారు.

దుస్తులపై జీఎస్​టీ పెంపు వాయిదా

దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన​ 46వ జీఎస్​టీ మండలి సమావేశమైంది. ఈ భేటీలో కొన్ని వస్తువులపై పన్ను రేట్ల సవరణ సహా పలు కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారులు, పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల చెప్పులు, దుస్తులపై 5 శాతం ఉన్న జీఎస్‌టీని 12శాతానికి పెంచారు. ఈ రేట్లు 2022 జనవరి 1న అమల్లోకి రావాల్సి ఉంది. అయితే దీనిపై చేనేత కార్మికులు, వ్యాపారుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రేట్లు పెంచడం వల్ల చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నది వారి వాదన. ఈ నేపథ్యంలో దుస్తులపై పన్ను పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో నేటినుంచి అందుబాటులో ప్రీమియం బ్రాండ్ల మద్యం

ABOUT THE AUTHOR

...view details