ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సీనియారిటీ జాబితా ఖరారు చేయండి.. పదోన్నతులు ఇవ్వండి' - finance employees protest news in sachivalayam updates

పదోన్నతుల కోసం సీనియారిటీ లిస్టును ఖరారు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్ధికశాఖ ఉద్యోగులు సచివాలయంలో ధర్నాకు దిగారు. పదోన్నతలు, సీనియారిటీ లిస్టు విషయంలో అభ్యంతరాలు ఉన్నాయని తక్షణం వీటిపై నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.

finance employees
finance employees

By

Published : Aug 27, 2020, 3:04 PM IST

పదోన్నతుల కోసం సీనియారిటీ లిస్టును ఖరారు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్థికశాఖ ఉద్యోగులు సచివాలయంలో ధర్నాకు దిగారు. సెక్రటేరియట్​ రెండో బ్లాక్ లో ఉన్న ఆ శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ ఛాంబర్ వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. పదోన్నతులు, సీనియారిటీ విషయంలో అభ్యంతరాలు ఉన్నాయని.. తక్షణం వీటిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రమోషన్ ప్యానెల్ అంగీకరించినా సీనియారిటీ లిస్టును ఖరారు చేయలేదంటూ ఉద్యోగుల ఆరోపించారు. ఫలితంగా.. తమ ప్రమోషన్లు ఆగిపోయాయన్నారు. ఈ నెల 31వ తేదీతో ప్యానెల్ గడువు ముగుస్తోందని.. గడువులోగా జాబితా ఖరారు చేయకుంటే ప్రమోషన్లల్లో అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

ఈ విషయంపై ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించుకుందామని అభ్యర్థించారు. చివరికి.. ఉద్యోగులు ఆందోళన విరమించారు. మరోవైపు.. ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో సచివాలయ భద్రతా సిబ్బంది మిగతావారిని రెండో బ్లాక్ లోకి అనుమతించకుండా కట్టడి చేశారు. సచివాలయంలో రాకపోకలను కొద్దిసేపు నిలిపివేశారు.

ఇదీ చదవండి:

విశాఖ అతిథి గృహంపై సమాధానం ఇవ్వండి: హైకోర్టు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details