పోలవరం పునరావాస లెక్కలపై కేంద్రం ఆరా - finanace ninistry look on polavaram rehabhhlitation
పోలవరం పునరావాస లెక్కలపై కేంద్ర ఆర్థిక శాఖ ఆరా తీస్తోంది. ప్రాజెక్టుకు సవరించిన అంచనాలను సాంకేతిక సలహా కమిటీ ఆమోదించినా....ఆర్థిక శాఖ పరిశీలన కోనసాగుతోంది. 2014 ఏప్రిల్ ఒకటికి ముందు, పోలవరానికి జాతీయ హోదా ప్రకటించటానికి పూర్వ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుపై కూడా అనేక వివరాలను అడిగింది. పునరావాసంపై చేసిన ఖర్చుపై అడిట్ నివేదికను కోరింది.
పోలవరం ప్రాజెక్టుకు రూ.55,548.87 కోట్లతో సవరించిన అంచనాలను సాంకేతిక సలహా కమిటీ ఆమోదించినా ..ఆర్థిక శాఖ పరిశీలన కొనసాగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ఆర్ధిక శాఖ నియమించిన కమిటీ లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా దిల్లీలో పునరావాసంపై గురువారం నిర్వహించిన సమావేశంలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాద్ దాస్ పాల్గొన్నారు. 2014 ఏప్రిల్ ఒకటికి ముందు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించడానికి పూర్వం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుపై అనేక వివరాలను అడిగారు. అప్పట్లో పునరావాసంపై చేసిన ఖర్చుకు సంబంధించిన అడిట్ నివేదికను కోరారు. కేంద్ర ఆర్థిక శాఖ నియమించిన కమిటీకి పాత ఖర్చులతో పాటు అడిగిన వివరాలను సమర్పించారు. ఆ అనుమానాలన్నీ నివృత్తి చేస్తే కేంద్రం నుంచి విడుదల కావాల్సిన రూ. 5500 కోట్ల మొత్తంలో తక్షణమే రూ. 3000 కోట్ల వరకు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి వర్తమానం ఉన్నట్లు తెలిసింది.
పని పరిణామాంపై కూడా....
పోలవరం ప్రధాన డ్యాం, పోలవరం కుడి, ఎడుమ కాలువల్లో పాత డీపీఆర్ కు , కొత్త డీపీఆర్‌కు మధ్య పని పరిమాణంలో ఏదైనా మార్పులు ఉన్నాయా అన్న విషయంపై కూడా పెట్టుబడుల కమిటీ దృష్టి సారించింది. 2010-11 ఆర్థిక సంవత్సరం నుుంచి ఏ ఏడాది ఎంత పని పరిమాణం జరిగిందో ఆ వివరాలను పట్టిక రూపంలో కేంద్ర కమటీ కోరింది.