సినిమా టికెట్ ధరల అంశంపై అమరావతి సచివాలయంలో.. కమిటీ సమావేశం నిర్వహించింది. జీవో నెంబర్ 35 ప్రకారమే ధరలు ఉండాలని కమిటీకి సూచించినట్లు.. కమిటీ సభ్యురాలు లక్ష్మి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో టికెట్ ధరలు పెంచాలని ఎగ్జిబిటర్లు కోరినట్లు వెల్లడించారు. టికెట్ ధరలపై విస్తృతంగా చర్చించిన కమిటీ సభ్యులు వివిధ అంశాలను ప్రస్తావించారు.
ఈ వ్యవహారంపై.. విస్తృతంగా చర్చించిన అనంతరం తదుపరి సమావేశం నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. థియేటర్లలోని వసతులు, అగ్నిమాపక శాఖ విధించే నిబంధనల అమలుపై కూడా చర్చించినట్టు కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని థియేటర్లలో స్వల్పంగా ధరలు పెంచుకునే వెసులుబాటు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు.