విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం కాపులుప్పాడ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 386/2లోని గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రానికి చెందిన 30 ఎకరాల్ని అతిథి గృహ నిర్మాణ నిమిత్తం ప్రభుత్వం తీసుకోవడాన్ని సవాలు చేస్తూ... గుంటూరుకు చెందిన గద్దె తిరుపతిరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది మురళీధర్ రావు వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేరుస్తూ అనుబంధ పిటిషన్ వేశామన్నారు. దానికి న్యాయస్థానం అనుమతించిందని వివరించారు. గ్రేహౌండ్స్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని నిధులు కేటాయించిందో తెలుపుతూ అఫిడవిట్ వేయలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ సొలిసిటర్ జనరల్ హరినాథ్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రేహౌండ్స్‌ను ఏర్పాటు చేసిందని కోర్టుకు తెలిపారు. కేంద్రానికి సంబంధం లేదన్నారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలని స్పష్టం చేసింది.
పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయండి: హైకోర్టు
విశాఖ జిల్లా కాపులుప్పాడ గ్రామ పరిధిలోని గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రానికి చెందిన 30 ఎకరాల్ని... అతిథి గృహం నిర్మాణం కోసం తీసుకోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర హోంశాఖను హైకోర్టు ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
File an affidavit with full details: High Court