తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని బాన్సువాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆసుపత్రికి వచ్చి విద్యార్థుల యోగ క్షేమాలు తెలుసుకున్నారు. సరియైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. పిల్లలందరు క్షేమంగా ఉన్నారని డాక్టర్లు పేర్కొన్నారు. పాఠశాలను సందర్శించి విచారణ చేపడతామని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నాసిరకం పదార్థాలు వినియోగిస్తే ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విచారణ చేపట్టి బాధ్యులైన వారిని తొలగించాలని ఆదేశించారు.
కొరవడిన పర్యవేక్షణ..