ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఐదో రోజు బ్రహ్మోత్సవాలు.. పొన్న వాహన సేవలో యాదాద్రీశుడు - తెలంగాణ వార్తలు

తెలంగాణలో యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పొన్న వాహనంపై నారసింహుడు ఐదోరోజు దర్శమిచ్చారు. వివిధ రకాల పూలు, ఆభరణాలతో స్వామి వారిని అలంకరించి ఊరేగించారు. అనంతరం పొన్నవాహన విశిష్టతను అర్చకులు వివరించారు.

fifth-day-yadadri
fifth-day-yadadri

By

Published : Mar 20, 2021, 1:33 PM IST

ఐదోరోజు బ్రహ్మోత్సవాలు.. పొన్న వాహన సేవలో యాదాద్రీశుడు

తెలంగాణ యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదోరోజు ఉత్సవాల్లో భాగంగా పొన్న వాహన సేవలో నారసింహుడు భక్తులను అలరించారు. వివిధ రకాల పూలు, ఆభరణాలతో స్వామివారిని సుందరంగా అలంకరించి... వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ బాలాలయ తిరువీధుల్లో ఊరేగించారు.

అనంతరం పొన్నవాహన సేవ విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. బాలాలయంలో జరిగిన ఈ ఉత్సవ కైంకర్యాల్లో ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రసాయన పరిశ్రమలో పేలుడు- నలుగురు మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details