తెలంగాణ రాష్ట్రంలోని ఫీవర్ ఆసుపత్రి డీఎంవో సుల్తానాను ఓ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం నిర్బంధించింది. ఫీవర్ ఆస్పత్రిలో అసిస్టెంట్ సివిల్ సర్జన్ అయిన సుల్తానాకు... పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. చికిత్స నిమిత్తం ఆమె చాదర్‌ఘాట్‌లోని తుంబె ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో రోజుకు ఏకంగా లక్షా పదిహేను వేల బిల్లు వేసినట్లు సుల్తానా సెల్ఫీ వీడియోలో వెల్లడించారు.
'' కరోనాతో నేను చాదర్‌ఘాట్‌లోని తుంబె ఆస్పత్రిలో చేరాను. ఈ యాజమాన్యం ఒక్క రోజుకు లక్షా 15 వేల రూపాయల బిల్లు వేస్తున్నారు. నా సోదరుడు ఇద్దరికి కలిపి లక్షా 5వేలరూపాయలు కట్టాడు. డిశ్చార్జ్ చేయమని అడిగితే వాళ్లు మమ్మల్ని నిర్బంధించారు. మాతో సరిగా ప్రవర్తించడంలేదు. సరైన చికిత్స అందిచట్లేదు. మందులు సైతం సమయానికి ఇవ్వకుండా... ఆహారం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు.''