ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జీహెచ్​ఎంసీ మేయర్​ ఎన్నికకు ముహుర్తం ఖరారు - జీహెచ్​ఎంసీ ఎన్నికలు

జీహెచ్​ఎంసీ మేయర్​ ఎన్నికను ఫిబ్రవరి11న నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అదే రోజు కార్పొరేటర్ల.. ప్రమాణస్వీకారం జరగనుంది.

mayor elections
జీహెచ్​ఎంసీ మేయర్​ ఎన్నికకు ముహుర్తం ఖరారు

By

Published : Jan 22, 2021, 6:30 PM IST

జీహెచ్​ఎంసీ నూతన మేయర్​ ఎన్నికకు ముహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి11న జీహెచ్ఎంసీ నూతన మేయర్ ఎన్నిక జరపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి11న ఉదయం11 గంటకు ఎన్నికైన కార్పొరేటర్లు.. ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం12 గంటల 30 నిమిషాలకు ప్రత్యేక సమావేశంలో మేయర్​ను ఎన్నుకోనున్నారు. మేయర్ ఎన్నిక అనంతరం ఉపమేయర్‌ ఎన్నిక కార్యక్రమం ఉంటుంది.

ఫిబ్రవరి11న ఎన్నిక జరగని పక్షంలో 12వ తేదీన ఎన్నిక జరపనున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిని ఎన్నికల సంఘం నియమించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని కలెక్టర్‌కు ప్రిసైడింగ్‌ అధికారిగా బాధ్యతలు అప్పగించనుంది. ఎన్నిక ప్రక్రియ పర్యవేక్షణ పరిశీలకుడిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని నియమించనున్నారు.

ఇదీ చదవండి:ఎస్‌ఈసీతో సమావేశానికి పంచాయతీరాజ్‌ అధికారుల గైర్హాజరు

ABOUT THE AUTHOR

...view details