ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హవాలా-డొల్ల కంపెనీలు... ఎఫ్​డీఐల కుంభకోణంలో సంచలనాలు - ఎఫ్​డీఐల కుంభకోణంలో తుదిదశకు చేరిన సీసీఎస్​ పోలీసుల దర్యాప్తు

FDI scandal: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎఫ్​డీఐల కుంభకోణంలో సీసీఎస్​ పోలీసుల దర్యాప్తు తుది దశకు చేరింది. దర్యాప్తులో హవాలా, డొల్ల కంపెనీలు...ఇలా అనేక కోణాలు వెలుగు చూశాయి. కొట్టేసిన సొమ్మును వివిధ హవాలా ఖాతాల ద్వారా బదిలీ చేసినట్లు గుర్తించారు. నిందితులకు సంబంధించి మిగిలిన ఆస్తులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఏపీ, తెలంగాణలోని రిజిస్ట్రేషన్‌ శాఖల కార్యాలయాలకు పోలీసులు లేఖలు రాశారు. త్వరలో ఈ కేసుకు సంబంధించి ఛార్జిషీట్‌ వేసే అవకాశం ఉంది.

FDI scandal
ఎఫ్​డీఐల కుంభకోణం

By

Published : Mar 14, 2022, 10:26 AM IST

ఎఫ్​డీఐల కుంభకోణం

FDI scandal: తెలుగు రాష్ట్రాల్లోని ఎఫ్​డీఐల కుంభకోణం కేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గిడ్డంగుల సంస్థ ఎఫ్‌డీల కుంభకోణంలో 13 మంది, ఆయిల్‌ఫెడ్‌ ఉదంతంలో 14 మంది నిందితులను అరెస్టు చేశారు. ఇప్పటివరకు రూ.6 కోట్ల 57 లక్షల నగదు రికవరీ, ఖాతాల స్తంభన, ఆస్తుల సీజ్‌ చేశారు. ఈ కేసుల్లో కీలక సూత్రధారి అయిన సాయికుమార్‌... మరికొందరు నిందితులతో కలసి ముంబైలోని మార్వలెస్‌ బిల్డ్‌ ఇన్‌ఫ్రా అనే డొల్ల కంపెనీని.. కోటి రూపాయలు చెల్లించి కొనుగోలు చేశారు. విశాఖ శివారు గాజువాకలోని రూ.60 లక్షల విలువైన ప్లాట్, తణుకులో 27 లక్షల విలువైన ప్లాట్.. ఇలా చాలా ఆస్తులను కొని.. అధిక ధరలకు రిజిస్టర్‌ చేయించారు. అధిక విలువ చూపించి.. వీటిని తనఖా పెట్టి కంపెనీ కోసం బ్యాంకు రుణం తీసుకోవాలనుకున్నారు. తర్వాత వచ్చిన డబ్బుతో దారి మళ్లించిన ఎఫ్‌డీల మొత్తాన్ని తిరిగి బ్యాంకులకు చెల్లించాలన్నది వీరి పన్నాగం.

FDI scandal: మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను స్వాహా చేసేందుకు ముంబైలోని ఓ బ్యాంకు అధికారిని, కోల్‌కతాలో ఓ మధ్యవర్తిని సాయికుమార్‌ సంప్రదించాడు. కోల్‌కతాలో మధ్యవర్తికి... కోటి రూపాయలు ఇచ్చినట్లు దర్యాప్తులో బయటపడింది. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతలను పరిచయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఈ మొత్తాన్ని ముట్టజెప్పాడు. కానీ మధ్యలోనే ప్లాన్‌ బెడిసికొట్టి దొరికిపోయారు.

FDI scandal: భవానీపురం ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకులో గిడ్డంగుల సంస్థ 9.6 కోట్లను ఎఫ్‌డీల్లో డిపాజిట్‌ చేసింది. దీనిని ముందే రద్దు చేసి... ఇదే బ్యాంకులో సంస్థ పేరుతో నకిలీ ఖాతాలను తెరిచి అందులోకి 7.6 కోట్లను బదిలీ చేశారు. దీని నుంచి సొమ్మును తరలించడానికి హవాలా మార్గాన్ని ఎంచుకున్నారు. ఏజెంట్లకు 15 శాతం కమీషన్‌ ముట్టజెప్పారు. సొమ్ము ముంబై, గుజరాత్, చెన్నై, హైదరాబాద్‌.. ఇలా దాదాపు 19 బ్యాంకుల్లోని 24 ఖాతాల గుండా తిరిగి ఆఖరుకి హైదరాబాద్‌లో డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఏపీ మర్కంటైల్‌ కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ వ్యవస్థాపకుడు సత్యనారాయణ... డిపాజిట్ల సొమ్మును డొల్ల ఖాతాలకు మళ్లించడంలో క్రియాశీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలింది.

FDI scandal: ఈ కుంభకోణంలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర కూడా ఉండడంతో... అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లను కూడా చేర్చారు. భవానీపురంలో ఒకటి, ఆత్కూరులో రెండు, పెనమలూరు స్టేషనులో ఒక కేసు చొప్పున నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో వేర్వేరు కోర్టులకు కాకుండా అన్నింటినీ అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం పరిధిలోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు. ఇందుకోసం విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు. దీనికి న్యాయమూర్తి అనుమతి ఇస్తే.. ఇక్కడే ఛార్జిషీట్‌ దాఖలు చేయనున్నారు.

ఇదీ చదవండి:

Suicide: సినిమా బాగోలేదని 'డై' హార్డ్ ఫ్యాన్ ఆత్మహత్య!

ABOUT THE AUTHOR

...view details