Dubbaka rape incident: సమాజంలో జరుగుతున్న వరుస అత్యాచారాలు, యాసిడ్ దాడులు..ప్రేమోన్మాదుల నుంచి తన కూతుళ్లను ఎలా కాపాడుకోవాలని ఆడపిల్లల తండ్రులు ఆందోళన చెందుతున్న ఈ సమయంలో... కంటికి రెప్పలా చూడాల్సిన వాడే కామంధుడయ్యాడు. కంచె చేను మేసినట్లు ప్రవర్తించాడు ఈ కసాయి తండ్రి.. సొంత కూతుళ్లు అని మరిచి వారిపైనే దారుణానికి ఒడిగట్టాడు.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాకా సీఐ మున్నూరు కృష్ణ తెలిపిన వివరాలు ప్రకారం.. మిరుదొడ్డి మండలానికి చెందిన ఓ మహిళ తన భర్త చనిపోగా.. తన ఇద్దరు ఆడపిల్లలతో జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తనకు, తన పిల్లలకు తోడుగా ఉంటాడని భావించి మూడేళ్ల కిందట ఓ వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. భర్తతో సహా 8, 6 ఏళ్ల వయస్సు కలిగిన బాలికలతో ఆరు నెలల క్రితం బతుకుదెరువుకు దుబ్బాకకు వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. శనివారం సదరు తల్లి తన పిల్లలను పెంపుడు తండ్రి వద్ద వదిలేసి కూలీ పనులకు వెళ్లగా.. ఇదే అదునుగా ఆ పెంపుడు తండ్రి ఆ ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వారి కేకలు విన్న ఇంటి పక్కవాళ్లు అక్కడికి వచ్చే సరికి.. అతడు అక్కడ నుంచి జారుకున్నాడు.