ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Suicide: 'నా కుటుంబంతో సంతోషంగా లేను... అందుకే నా కుతురిని కూడా..!' - father daughter suicide in yadagirigutta

Father Daughter Suicide in Yadadri: కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ వ్యక్తి చనిపోవాలనుకున్నాడు. కానీ తాను లేకపోతే తన కూతురు కష్టాలు పడుతుందని.. తనను కూడా అతడి వెంటే తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకే లేఖ రాసిపెట్టి తన కుమార్తెతో సహా భవనంపై నుంచి దూకి తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటనలో ఎక్కడ జరిగిందంటే..?

Father Daughter Suicide in Yadadri
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

By

Published : Apr 1, 2022, 12:38 PM IST

Father Daughter Suicide in Yadadri:"నా కుటుంబంతో నేను సంతోషంగా లేను. కుటుంబ కలహాల వల్లే నేను చనిపోదామనుకుంటున్నాను. నేనొక్కడినే చనిపోతే నా గారాలపట్టి.. నా పంచప్రాణాలు.. నా బంగారు తల్లి.. నా కూతురు శ్రేష్ఠ ఒంటరిదైపోతుంది. నా భార్య తనను సరిగ్గా చూసుకోదు. నేను లేకపోతే తను చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. అందుకే తనను కూడా నాతో పాటే తీసుకువెళ్తున్నాను" అని సూసైడ్ నోట్ రాసి ఓ వ్యక్తి తన ఆరేళ్ల కుమార్తెతో భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణలోని యాదగిరిగుట్టలోని ఓ లాడ్జీలో చోటు చేసుకుంది.

Father Daughter Suicide in Yadagirigutta: తెలంగాణలోని యాదగిరిగుట్టలో గురువారం అర్ధరాత్రి ఓ లాడ్జీ భవనం పైనుంచి ఓ తండ్రి తన కుమార్తెతో కలిసి దూకాడు. గమనించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించి వారిని ఆస్పత్రికి తరలించారు. తండ్రీకుమార్తెలిద్దరూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాలను పోలీసులు భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

మృతులు చెరుకూరి సురేశ్(40), శ్రేష్ట(6)గా పోలీసులు గుర్తించారు. సురేశ్ హైదరాబాద్ బీఎస్‌ఎన్‌ఎల్‌లో పని చేస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఘటనాస్థలిలో దొరికిన సూసైడ్ నోట్‌లో కుటుంబ కలహాల వల్లే చనిపోతున్నట్లు ఉందని పోలీసులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details