సీఎం జగన్ మనసు మార్చాలంటూ.. గ్రామదేవతలకు పూజలు - అమరావతి రైతుల వార్తలు
అమరావతినే పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించాలంటూ మంగళగిరి మండలంలో రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 26వ రోజుకు చేరుకున్నాయి. కృష్ణాయపాలెంలో మహిళలు పోలేరమ్మకు పొంగళ్లు పెట్టారు. రాజధానిగా అమరావతినే ఉంచేలా ముఖ్యమంత్రి జగన్ మనస్సు మార్చాలని అమ్మవారికి మొక్కుకున్నారు. గ్రామంలో పొంగళ్లతో ఊరేగింపు నిర్వహించారు. ఎర్రబాలెంలో మహిళలు వంటా వార్పు చేశారు. మందడం, తుళ్లూరులో మహిళలపై జరుగుతున్న దాడులను ఆపాలంటూ డిమాండ్ చేశారు.
మందడంలో గ్రామదేవతకు పూజలు
.