వైకాపా వ్యవసాయ వ్యతిరేక విధానాలపై తెదేపా పోరాటాన్ని రైతు సంఘం నాయకులు అభినందించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడును తెదేపా కేంద్ర కార్యాలయంలో మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఎర్నేని నాగేంద్రనాథ్, ఏపీ రైతు సంఘం అధ్యక్షులు వై.కేశవరావు, ఏపీ కిసాన్ సభ కార్యదర్శి డి.హరినాథ్ తదితరులు కలిశారు. రైతుల తరఫున పోరాడేందుకు తెదేపా ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు వారితో అన్నారు. రాష్ట్రంలో రైతు సమస్యలపై చర్చించారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో రైతుల్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.
'రైతుల తరఫున పోరాడేందుకు తెదేపా ముందుంటుంది' - Farmers Unions latest news
రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడును మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఎర్నేని నాగేంద్రనాథ్, ఏపీ రైతు సంఘం అధ్యక్షులు వై.కేశవరావు, ఏపీ కిసాన్ సభ కార్యదర్శి డి.హరినాథ్ తదితరులు కలిశారు. వైకాపా వ్యవసాయ వ్యతిరేక విధానాలపై తెదేపా పోరాటాన్ని రైతు సంఘం నాయకులు అభినందించారు.
'రైతుల తరుఫున పోరాడేందుకు తెదేపా ముందుంటుంది'