అమరావతిలో ఉద్రిక్తత... ఎమ్మెల్యే కారుపై రాళ్ల దాడి..
12:43 January 07
ఆందోళనకారులపై పోలీసుల లాఠీచార్జ్
అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల రహదారుల నిర్బంధం నేపథ్యంలో చినకాకాని వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి రహదారిని నిర్బంధం చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు వాహనాలపై రాళ్లు రువ్వారు. దీనితో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని రైతులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కారుపై రైతులు రాళ్లతో దాడి చేసి.. అద్దాలు ధ్వంసం చేశారు. రైతులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
TAGGED:
breaking