ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతికి వ్యతిరేకమైన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే రెండో విడత పాదయాత్ర

Amaravati farmers padayatra ప్రభుత్వం అమరావతిని పట్టించుకోకుండా మూడు రాజధానుల గురించి అలోచిస్తుందని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టించడాన్ని అమరావతి ఐకాస నేతలు వ్యతిరేకించారు. అమరావతికి వ్యతిరేకమైన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే రెండో విడత పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేశారు.

against-three-capitals
మూడు రాజధానులపై

By

Published : Aug 20, 2022, 8:24 PM IST

Amaravati farmers: అమరావతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే రెండో విడత పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్లు అమరావతి ఐకాస నేతలు తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని అనంతవరం వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి వెంకటపాలెం తితిదే ఆలయం వరకు రైతులు, మహిళలు పాదయాత్ర చేపట్టారు. మూడు రాజధానులపై రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు పెట్టించడంపై ఐకాస నేతలు మండిపడ్డారు. రాజధాని అమరావతి ప్రజలందరిదనే విషయాన్ని పాదయాత్రలో మరోసారి వివరిస్తామని తెలిపారు.

ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం, న్యాయస్థానాలపైన ఏ మాత్రం గౌరవం లేదని అమరావతి రైతులన్నారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోరాటం చేస్తామన్నారు. రాజధాని యావత్ ఆంధ్రప్రదేశ్​ది అని అన్నారు. హైకోర్టు అమరావతిని అభివృద్ధి చేయాలని స్పష్టమైన తీర్పు ఇచ్చినా.. ఈ ప్రభుత్వంలో చలనం లేకపోగా మూడు రాజధానుల గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. అమరావతి అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధని.. ఈ విషయాన్ని రాష్ట్రమంతటా తెలియజేసేందుకే రెండో విడత పాదయాత్ర చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

అమరావతికి వ్యతిరేకమైన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే రెండో విడత పాదయాత్ర

ABOUT THE AUTHOR

...view details