ఆంధ్రప్రదేశ్‌ను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారని జగన్‌కు పాలనా పగ్గాలు ఇస్తే.. కేసుల కోసం దిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని రాజధాని రైతులు ఆరోపించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మంగళగిరి మండలం ఎర్రబాలెం, కృష్ణాయపాలెంలో 61వ రోజూ దీక్షలు చేపట్టారు. కృష్ణాయపాలెంలో రైతులు చేస్తున్న నిరసనదీక్ష రెండోరోజుకు చేరుకుంది. అమరావతి కోసం 60గంటల నిరహార దీక్ష చేస్తున్న రైతులకు బీపీ, షుగర్ స్థాయి పడిపోయింది. రాజధానిని ఇక్కడే కొనసాగిస్తామంటూ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకూ పోరాటం ఆగదని అన్నదాతలు స్పష్టంచేశారు.
అమరావతిని కొనసాగించే వరకు పోరాటం ఆగదు: రాజధాని రైతులు - అమరావతి ఆందోళనలు తాజా వార్తలు
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మంగళగిరి మండలం ఎర్రబాలెంలో రైతులు చేపట్టిన దీక్షలు 61వ రోజూ కొనసాగాయి. కృష్ణాయపాలెంలో రైతులు చేస్తున్న నిరసనదీక్ష రెండోరోజుకు చేరుకుంది.
కృష్ణాయపాలెంలో రైతుల దీక్ష