ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లైవ్​ అప్​డేట్స్​: అమరావతి ప్రాంతంలో ఆగని రైతుల పోరు - undefined

ఆగని రైతుల పోరు
ఆగని రైతుల పోరు

By

Published : Jan 19, 2020, 9:23 AM IST

Updated : Jan 19, 2020, 1:20 PM IST

12:40 January 19

13 అంతస్తుల భవనం పైకి ఎక్కిన రైతులు

13 అంతస్తుల భవనం పైకి ఎక్కిన రైతులు

అమరావతి రాజధాని కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముగ్గురు రైతులు రాయపూడిలోని ఎమ్మెల్యే క్వార్టర్స్​ బిల్డింగ్​పైకి ఎక్కారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ నినాదాలు చేశారు.   

11:08 January 19

రేపు అసెంబ్లీ ముట్టడికి అమరావతి ఐకాస పిలుపు

రేపు అసెంబ్లీ ముట్టడికి అమరావతి ఐకాస పిలుపునిచ్చింది. ఐకాస పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తెలుగుదేశం నేతలకు పోలీసులు నోటీసులిచ్చారు. శాంతిభద్రతలకు భంగం కలిగేంచే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఆ మేరకు తమవద్ద సమాచారం ఉందన్న పోలీసులు... శాంతిభద్రతలకు భంగం కలగకుండా నిరసనలు తెలపవచ్చని సూచించారు. 

10:03 January 19

సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధురాలు

రాజధానిగా అమరావతి కొనసాగాలని మహిళలు మందడం శివాలయం నుంచి విజయవాడకు కాలినడకన బయల్దేరారు. కనకదుర్గమ్మకు మొక్కు చెల్లించుకునేందుకు బయల్దేరినవారిలో గారికిపాటి పార్వతి అనే వృద్ధురాలు మధ్యలో సొమ్మిసిల్లి పడిపోయింది. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.  

09:40 January 19

మందడం నుంచి దుర్గమ్మ గుడికి బయలుదేరిన మహిళలు

అమరావతిలో 33వ రోజు రాజధాని రైతుల దీక్ష కొనసాగుతోంది. మందడం, వెలగపూడిలో రైతులు, మహిళలు దీక్షలో పాల్గొన్నారు. మందడంలో రోడ్డుపైనే రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

మహిళలు మందడం శివాలయం నుంచి దుర్గమ్మ గుడికి బయలుదేరారు. మొక్కు తీర్చుకునేందుకు పొంగళ్లతో 13 కి.మీ. పాదయాత్ర కొనసాగనుంది. మార్గమధ్యంలోని గ్రామాల మహిళలతో కలిసి పాదయాత్ర చేయనున్నారు. 

09:12 January 19

33వ రోజు రైతుల ఆందోళనలు

అమరావతి ప్రాంతంలో రైతుల పోరు 33వ రోజుకు చేరింది. ఇవాళ మందడం, తుళ్లూరులో రైతులు మహాధర్నాలు నిర్వహించనున్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగనున్నాయి. ఉద్దండరాయునిపాలెంలో మహిళలు పూజలు చేయనున్నారు. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెంలోనూ రైతుల నిరసనలు కొనసాగనున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లో పార్టీలు, ప్రజాసంఘాల ఆందోళనలు చేయనున్నాయి. 

Last Updated : Jan 19, 2020, 1:20 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details