గవర్నర్ తీరుకు నిరసనగా తుళ్లూరులో రైతుల ధర్నా
పరిపాలన వికేంద్రీకరణతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపటంపై తుళ్లూరులో రైతులు ఆందోళనకు దిగారు. గవర్నర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రహదారిపై బైఠాయించారు. పాలనా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం నెలకొంది.