ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులంటారా? త్యాగాలను అవమానిస్తారా?'

తుళ్లూరు రైతులు.. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను పెయిడ్ అర్టిస్టులని మంత్రులు, ఎమ్మెల్యేలు కామెంట్ చేయడం సరికాదని అన్నారు. ప్రభుత్వం తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు.

farmers protest in tulluru of amaravathi 13 day
farmers protest in tulluru of amaravathi 13 day

By

Published : Dec 30, 2019, 10:24 AM IST

తుళ్లూరులో రైతుల మహా ధర్నా

అమరావతి పరిధిలోని తుళ్లూరులో రైతులు 13వ రోజు ఆందోళనలు, మహా ధర్నా కొనసాగిస్తున్నారు. తమ త్యాగాలను అవమానిస్తూ వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏ కులానికో, మతానికో చెందిన వారిగా భూములు ఇవ్వలేదని స్పష్టం చేశారు. హై పవర్ కమిటీకి విశ్వసనీయత లేదన్న రైతులు.. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారాలు ఆపాలని.. తమను పెయిడ్ ఆర్టిస్టులంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఆపాలని డిమాండ్ చేశారు. అమరావతినే ప్రభుత్వం రాజధానిగా గుర్తించాలని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు.. తుళ్లూరులో మహా ధర్నా శిబిరం నుంచి మా ప్రతినిధి అందిస్తారు.

తుళ్లూరులో రైతుల మహా ధర్నా

ABOUT THE AUTHOR

...view details