ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు నేటికి 250 రోజులకు చేరాయి. ఇవాళ రాజధాని రణభేరి పేరుతో రాజధాని గ్రామాల్లో రైతుల నిరసనలు చేపట్టారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. కరోనా సమయంలోనూ తుళ్లూరులో రైతులు, మహిళలు నిరసనలు హోరెత్తిస్తున్నారు. ప్లకార్డులు పట్టుకుని విభిన్న రూపాల్లో నిరసనలు తెలియజేశారు. రాజధాని విషయంలో ప్రభుత్వం నిర్ణయం మార్చకుంటే మరింత ఉద్ధృతం చేస్తామని చెప్పుతున్నారు.
తుళ్లూరు: 250వ రోజూ ఉద్ధృతంగా అమరావతి ఉద్యమం - The 250th daily excerpt from the Amravati movement
అమరావతి ఉద్యమం 250 రోజూ ఉద్ధృతంగా కొనసాగుతోంది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. రైతులు విభిన్నరూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు.

250వ రోజూ ఉద్ధృతంగా అమరావతి ఉద్యమం