ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్రం కోసం త్యాగాలు చేస్తే... ఇదా బహుమతి..?'

రాజధాని తరలింపు ప్రతిపాదనపై అమరావతి ప్రాంతంలో ఆందోళనలు మిన్నంటాయి. రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన అన్నదాతలను రోడ్డున పడేయడమేనా న్యాయం అని నిలదీస్తున్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

farmers protest in amaravathi
'రాష్ట్రం కోసం త్యాగాలు చేస్తే... ఇదా బహుమతి..?'

By

Published : Dec 22, 2019, 7:02 AM IST

'రాష్ట్రం కోసం త్యాగాలు చేస్తే... ఇదా బహుమతి..?'

రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పాటు చేయాలంటూ... జీఎన్ రావు కమిటీ ఇచ్చిన సిఫార్సులపై... అమరావతి రైతులు చేస్తున్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఆందోళనలతో ఆ ప్రాంతం అట్టుడుకుతోంది. సచివాలయం సహా ప్రధాన రహదారులను దిగ్బంధించిన రైతులు... వంటా వార్పు నిర్వహించారు. తమ జీవితాలతో ఆడుకోవద్దని నినదించారు.

రైతుల ఆందోళనకు పలువురు న్యాయవాదులు, రాజకీయ పార్టీల నేతలు మద్దతు పలికారు. రాజధాని తరలింపు ప్రక్రియను ప్రభుత్వం విరమించుకోవాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం తమ తల్లిదండ్రులు భూములిచ్చారని... ఇప్పుడు తమ భవిష్యత్తే అగమ్యగోచరంగా తయారైందని... అన్నదాతల పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆందోళనలు ఉద్ధృతం చేసిన రైతులు... నేడు ఉద్దండరాయినిపాలెం శంకుస్థాపన ప్రదేశంలో వంటా వార్పు, వెలగపూడి, మందడం, రాయపూడి గ్రామాల్లో నిరసనలు కొనసాగించనున్నారు. తుళ్లూరు, పెద్దపరిమి గ్రామాల్లో మహాధర్నా చేపట్టనున్నారు. ప్రభుత్వం రాజధాని తరలింపును ఉపసంహరించుకునే వరకూ... ఆందోళనను కొనసాగిస్తామని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి స్పష్టం చేసింది. అన్నదాతల ఆందోళనలకు వీఐటీ విద్యార్థులు మద్దతు తెలిపారు. నేడు మందడంలో జరగనున్న ధర్నాలో పాల్గొననున్నారు.

ABOUT THE AUTHOR

...view details