రాజధాని విషయంలో సీఎం జగన్ ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని వెలగపూడి రైతులు కోరారు. 95 వ రోజు దీక్షా శిబిరంలో కూర్చుని 'జై అమరావతి' అంటూ నినాదాలు చేశారు. అమరావతి సాధన కోసం ఎన్ని రోజులైనా తమ నిరసనను కొనసాగిస్తామన్నారు. ఐదుగురు రైతులు ఇవాళ 24 గంటల రిలే నిరాహార దీక్షలకు కూర్చున్నారు.
24 గంటల రిలే దీక్షలో వెలగపూడి రైతులు - 95వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన
అమరావతి రైతుల దీక్షలు 95 వ రోజుకు చేరాయి. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో దీక్షా శిబిరాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
farmers-protest-for-capital-amaravathi-in-guntur