పాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం, సీఆర్‌డీఏ బిల్లు రద్దును నిరసిస్తూ రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. రైతుల పిటిషన్‌పై మధ్యాహ్నం హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. రాజధాని రైతు పరిరక్షణ సమితితో పాటు హైకోర్టులో మరికొందరు పిటిషన్ వ్యాజ్యంలో సీఎస్, సీఆర్‌డీఏ కమిషనర్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శితో పాటు మరికొందరిని ప్రతివాదులుగా పిటిషనర్లు పేర్కొన్నారు.
రెండు బిల్లులను నిరసిస్తూ హైకోర్టులో రాజధాని రైతుల పిటిషన్ - amaravathi farmers petition in high court
పాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం, సీఆర్‌డీఏ బిల్లు రద్దును నిరసిస్తూ రాజధాని రైతులు హైకోర్టులో వేసిన పిటిషన్ ఈ రోజు మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం ఉంది. నిపుణులు, ఉన్నతస్థాయి కమిటీ నివేదికలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని పిటిషన్ వేశారు. సీఆర్‌డీఏ బృహత్తర ప్రణాళికను అమలు చేసేలా ఆదేశించాలని పిటిషనర్లు పేర్కొన్నారు.
రాజ్‌భవన్, సచివాలయం తరలించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసు శాఖల కార్యాలయాలను తరలించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. జులై 31 న జారీచేసిన గెజిట్ ప్రకటనలను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. నిపుణులు, ఉన్నతస్థాయి కమిటీ నివేదికలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలన్నారు. సీఆర్‌డీఏ బృహత్తర ప్రణాళికను అమలు చేసేలా ఆదేశించాలని పిటిషనర్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అప్పు తీర్చలేదని మహిళను ట్రాక్టర్‌తో తొక్కించిన వైకాపా నాయకుడు