ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CRDA: పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వ్యతిరేకం కాదు: అమరావతి రైతులు - సీఆర్డీఏ చట్టానికి సవరణలపై ఆందోళనలు

APCRDA: చట్టానికి సవరణలు నిరసిస్తూ రాజధాని రైతులు ఆ బిల్లు ప్రతులను తగలపెట్టారు. ఇచ్చిన హామీ మేరకు రాజధానిని అభివృద్ధి చేసి ఎన్ని చట్ట సవరణలనైనా చేసుకోవాలన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో ఇళ్లు లేని పేదలు 14వేల మంది ఉన్నారని, మొదట వారికి కేటాయించి రాజధానిని అభివృద్ధి చేయాలని రైతులు డిమాండ్‌చేశారు.

crda
CRDA

By

Published : Sep 22, 2022, 1:41 PM IST

Updated : Sep 22, 2022, 2:55 PM IST

CRDA: ఏపీ ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకు రెండే కాళ్లు అన్న చందగా ప్రవర్తిస్తోంది. ఓ వైపు రాజధాని బిల్లును మరో రూపంలో మళ్లీ తెచ్చేందుకు ప్రయత్నిస్తునే.. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ పేరిట కొత్త వివాదానికి తెర లేపుతోంది. ఇదే అంశంపై రాజధాని రైతులు ఐకాసా నేతలు జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

సీఆర్​డీఏ చట్టానికి సవరణలు నిరసిస్తూ రాజధాని రైతులు.. ఆ బిల్లు ప్రతులను తగలపెట్టారు. ఇచ్చిన హామీ మేరకు రాజధానిని అభివృద్ధి చేసి ఎన్ని చట్ట సవరణలనైనా చేసుకోవాలన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో ఇళ్లు లేని పేదలు 14వేల మంది ఉన్నారని మొదట వారికి కేటాయించి రాజధానిని అభివృద్ధి చేయాలని రైతులు డిమాండ్‌చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 22, 2022, 2:55 PM IST

ABOUT THE AUTHOR

...view details