రాజధాని ప్రాంత అసైన్డ్ భూముల రైతులు మంత్రి బొత్సను కలిశారు. అసైన్డ్ భూముల క్రయవిక్రయాలపై ఇచ్చిన జోవోను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అసైనీల వద్ద చాలా రోజుల క్రితం భూములు కొన్నామని.. సెకండ్ పార్టీగా ఉన్న తమకు భూములు చెందేలా జోవో సవరించాలని కోరారు. ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చేందుకు నిరాకరించి కోర్టుకెక్కిన రైతులు సైతం బొత్సను కలిశారు. అభివృద్ధికి కావాల్సిన భూమి ఇస్తామని... తమకు వేరే చోట భూమి ఇవ్వాలని అభ్యర్థించారు. రాజధాని పరిధిలో భూమి లేని పేదలకు ఇచ్చే పింఛన్లు మొత్తం పెంచాలని వినతి పత్రం ఇచ్చారు.
మంత్రి బొత్సను కలిసిన రాజధాని అసైన్డ్ భూముల రైతులు - రాజధాని రైతుల ఆందోళనల వార్తలు
రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూముల క్రయవిక్రయాలపై ఇచ్చిన జోవోను రద్దు చేయాలని కోరుతూ పలువురు రైతులు మంత్రి బొత్సను కలిశారు. అలాగే రాజధాని పరిధిలో భూమి లేని పేదలకు ఇచ్చే పింఛన్లు మొత్తం పెంచాలని వినతి పత్రం ఇచ్చారు.
Farmers of Capital Assigned Lands meet with Minister Bostha