ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అసైన్డ్ భూములు అమ్ముకున్నారన్న వార్తలు అవాస్తవం: రైతులు - Amaravathi Lands Latest News

ప్రలోభాలకు లొంగి అసైన్డ్ భూములు అమ్ముకున్నారన్న వార్తలు అవాస్తవమని రైతులు స్పష్టం చేశారు. ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌ను రాయపూడి అసైన్డ్ రైతులు కలిశారు. రెండేళ్లు అవుతున్నా ఈ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోలేదని అన్నదాతలు అసహనం వ్యక్తం చేశారు.

ఏఎంఆర్‌డీఏ
ఏఎంఆర్‌డీఏ

By

Published : Mar 27, 2021, 8:45 PM IST

ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌ను రాయపూడి అసైన్డ్ రైతులు కలిశారు. ప్రలోభాలకు లొంగి అసైన్డ్ భూములు అమ్ముకున్నామన్న వార్తలు అవాస్తవమని రైతులు స్పష్టం చేశారు. గ్రామంలోని అసైన్డ్ భూమి ఇంకా తమ పేరుపైనే ఉందని రైతులు చెప్పారు. తమ భూమికి ప్లాట్లు కేటాయించాలని కమిషనర్‌ను కోరామని అన్నదాతలు వివరించారు. జరీబు భూమితో సమాన ప్యాకేజీ ఇప్పించాలని రాయపూడి రైతులు కోరారు.

కూలీల పింఛను రూ.5 వేలకు పెంచాలని కమిషనర్‌ను కోరామని రైతులు చెప్పారు. రెండేళ్లు అవుతున్నా ఈ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోలేదని అన్నదాతలు అసహనం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండీ... హెచ్చరిక: పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరువయ్యే అవకాశం..!

ABOUT THE AUTHOR

...view details