Farmers Meet Tamilnadu CM: తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు అన్ని రాష్ట్రాల్లోనూ అమలుకావాలని దక్షిణ భారత రైతు సంఘం నాయకులు ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసేందుకు వారు సన్నద్ధమయ్యారు. ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి తెలంగాణలో అమలవుతున్న పథకాలను వివరించారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, తదితర పథకాలు తమిళనాడులోనూ అమలు చేయాలని వినతిపత్రం అందించారు. సీఎం స్టాలిన్ వారి విజ్ఞాపన పట్ల సానుకూలంగా స్పందించారని రైతులు తెలిపారు. తెలంగాణ పథకాలు అద్భుతంగా ఉన్నాయన్న ఆయా రాష్ట్రాల రైతుసంఘం నాయకులు.. తమ తమ రాష్ట్రాల్లో అమలయ్యేలా ముందుకు సాగుతామని వివరించారు.
తెలంగాణ పథకాలను తమిళనాడులోనూ అమలు చేస్తాం: స్టాలిన్ - తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్
Farmers Meet Tamilnadu CM: తమిళనాడు సీఎం స్టాలిన్‌ను ఇవాళ దక్షిణ భారత రైతుసంఘం నాయకులు కలిశారు. తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని.. తమిళనాడులోనూ ఆ పథకాలు అమలుచేయాలని వినతిపత్రం అందజేశారు. సీఎం స్టాలిన్ వారి విజ్ఞాపన పట్ల సానుకూలంగా స్పందించారని రైతులు తెలిపారు.
తెలంగాణలో వ్యవసాయ పథకాలు అద్భుతంగా ఉన్నాయని.. ఆ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు తమిళనాడులో అమలు చేసేందుకు పరిశీలిస్తామని స్టాలిన్ హామీ ఇచ్చినట్లు సంఘం ఉపాధ్యక్షుడు, పసుపు బోర్డు సాధన సమితి అధ్యక్షుడు నరసింహ నాయుడు తెలిపారు. వానాకాలంలో 7వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం అంటే ఆషామాషీ కాదన్నారు. ఎమ్మెస్పీ విషయంలో కేంద్రానికి లేఖ రాసి సీఎం కేసీఆర్ మరోమారు రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నాడని... అన్ని రాష్ట్రాలు ఎమ్మెస్పీపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చదవండి: