ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఆర్డీఏ అధికారులకు అమరావతి రైతుల లేఖలు

​​​​​​​హై పవర్ కమిటీకి తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు అమరావతి రైతులు కార్యాచరణ రూపొందించారు. ప్రత్యేకంగా లేఖలు సిద్ధం చేసి సీఆర్డీఏ అధికారులకు అందించేలా చర్యలు చేపడుతున్నారు. అసైన్డ్ రైతులకు, రైతులకు వేర్వేరుగా లేఖలు ఐకాస సిద్ధం చేసింది. ఈ లేఖలను నేరుగా సీఆర్డీఏ అధికారులకు అందించాలని ఐకాస నిర్ణయించింది.

farmers  letter to crda office
farmers letter to crda office

By

Published : Jan 17, 2020, 11:23 AM IST

Updated : Jan 17, 2020, 1:25 PM IST

సీఆర్డీఏ అధికారులకు అమరావతి రైతుల లేఖలు

హై పవర్ కమిటీకి తమ అభ్యంతరాలు బలంగా తెలియజేయాలని రాజధాని రైతులు నిర్ణయించారు. వ్యక్తిగత, భూ వివరాలకు తోడు... సీఆర్డీఏతో కుదిరిన ఒప్పందం, ప్రభుత్వం ఇచ్చిన హామీలు, తమకు జరుగుతున్న నష్టం ఇలా అన్ని అంశాలనూ పొందుపరిచి సీఆర్డీఏ అధికారులకు నేరుగా అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు అసైన్డ్, ఇతర రైతులకు ఐకాస వేర్వేరుగా లేఖలు సిద్ధం చేసింది. ఇవాళ ఉదయం తుళ్లూరులో టెంట్ వేసేందుకు పోలీసులు అభ్యంతరం తెలపగా.... ప్రైవేటు స్థలంలో టెంట్ వేసి రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ తీరుపై రైతులు నిప్పులు చెరిగారు.

Last Updated : Jan 17, 2020, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details