అమరావతి పరిరక్షణ సమితి ఐకాస రాష్ట్ర కార్యాలయంలో... మహిళా ఐకాస ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రాన్ని మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలు చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన రైతులను నిలువునా ముంచారని, అన్నదమ్ముల మధ్యే విభేదాలు సృష్టించారని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించాలని కోరారు.
'భూములు ఇచ్చిన రైతులను నిలువునా ముంచారు' - Amaravathi Farmers Agitation latest news
ప్రభుత్వ 3 రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా... మహిళా ఐకాస ఆధ్వర్యంలో శవయాత్ర నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒకే రాష్ట్రం... ఒకే రాజధాని ఉండాలని డిమాండ్ చేశారు.
!['భూములు ఇచ్చిన రైతులను నిలువునా ముంచారు' Amaravathi Farmers Protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8267235-345-8267235-1596362154810.jpg)
మహిళా ఐకాస ఆధ్వర్యంలో శవయాత్ర