పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 663వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, బోరుపాలెం, పెదపరిమి, అబ్బరాజు పాలెం, దొండపాడు, మోతడక గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. 29 గ్రామాలకే ఉద్యమం పరిమితమవుతోందన్న ప్రభుత్వం వ్యాఖ్యలపై రైతులు మండిపడ్డారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో నవంబరు 1 నుంచి భారీ నిరసన ర్యాలీ చేయనున్నారు.
capital farmers protest: 663వ రోజూ కొనసాగిన రైతుల ఆందోళన - అమరావతి రైతుల ఆందోళన
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళన 663వ రోజూ కొనసాగింది. వెలగపూడి, అనంతవరం, బోరుపాలెం పలుగ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. హైకోర్టు నుంచి తిరుపతి వరకు రైతులు, మహిళల మహా పాదయాత్ర చేయనున్నారు. రోజుకు 10 నుంచి 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. యాత్రలో రోజూ 200 మంది రైతులు, మహిళలు పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
హైకోర్టు నుంచి తిరుపతి వరకు రైతులు, మహిళల మహా పాదయాత్ర చేయనున్నారు. రోజుకు 10 నుంచి 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. యాత్రలో రోజూ 200 మంది రైతులు, మహిళలు పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్ 17న యాత్ర ముగిసేలా రూట్ మ్యాప్ రూపొందిస్తున్నారు. ఉద్యమం ప్రారంభించి డిసెంబరు 17తో రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. యాత్రలో ముందుగా వెంకటేశ్వరస్వామి విగ్రహం ఉన్న వాహనం, కళాకారుల బృందం, ఆ తర్వాత డీజే వాహనం, రైతుల పాదయాత్ర ఉండేలా సిద్ధం చేస్తున్నారు. దారి పొడవునా వైకాపా ప్రభుత్వం అమరావతికి చేసిన అన్యాయంపై ప్రజలకు వివరించనున్నారు.
ఇదీ చదవండి:చంద్రబాబు, పవన్ నాటకాలు ప్రజలకు తెలుసు: మంత్రి కొడాలి నాని