ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'3 రాజధానులు' ప్రతిపాదనపై.. బంద్​కు రాజధాని రైతుల నిర్ణయం - అమరావతి బంద్

రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై... అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉద్ధండరాయనిపాలెంలో ఈ వ్యవహారంపై వారు చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేశారు. ప్రభుత్వం దిగివచ్చేవరకూ వివిధ రూపాల్లో తమ ఆందోళన తెలియజేయాలని నిర్ణయించారు.

amaravati farmers
అమరావతి రైతులు

By

Published : Dec 18, 2019, 7:56 PM IST

సుధాకర్‌తో ముఖాముఖి

ముఖ్యమంత్రి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనను రాజధాని అమరావతి పరిధిలోని రైతులు వ్యతిరేకించారు. రేపు అమరావతి ప్రాంతంలో బంద్‌ నిర్వహించాలని నిర్ణయించారు. అమరావతికి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెం వద్ద రైతులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం బంద్‌తో సరిపెట్టుకోకుండా ప్రభుత్వం దిగి వచ్చేవరకూ వివిధ రూపాల్లో తమ ఆందోళన తెలియజేస్తామని రాజధాని ప్రాంత రైతులు చెబుతున్నారు. అవసరమైతే బలిదానానికైనా సిద్ధమన్నారు. ప్రభుత్వ తీరు మారకుంటే ప్రధాని మోదీని కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details