ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Telangana: మెదక్ జిల్లా శివ్వంపేట తహసీల్దార్‌పై డీజిల్ పోసిన రైతులు - farmers poured diesel on shivampet tahsildar

తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా శివ్వంపేటలో.. రైతులు తహసీల్దార్​పై డీజిల్ పోశారు. సకాలంలో పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వకపోవడం వల్ల విద్యుదాఘాతంతో మృతి చెందిన ఓ రైతు కుటుంబం రైతు బీమా నగదు పొందలేకపోయిందని.. రైతులు ఆగ్రహంతో ఈ చర్యకు పాల్పడ్డారు.

farmers attack on Shivampet Tahsildar
మెదక్ జిల్లా శివ్వంపేట తహశీల్దార్‌పై డీజిల్ పోసిన రైతులు

By

Published : Jun 29, 2021, 3:27 PM IST

మెదక్ జిల్లా శివ్వంపేట తహశీల్దార్‌పై డీజిల్ పోసిన రైతులు

సకాలంలో పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వకపోవడం వల్ల విద్యుదాఘాతంతో మృతి చెందిన ఓ రైతు కుటుంబం రైతు బీమా నగదు పొందలేకపోయిందని ఆగ్రహం చెందిన రైతులు.. తహసీల్దార్​పై డీజిల్ పోశారు. ఈ ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లా శివ్వంపేటలో చోటుచేసుకుంది.

ఈనెల 28న తాళ్లపల్లి తండాలో మాలోత్ బాలు అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. అతనికి సకాలంలో పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వక పోవడం వల్ల మృతుని కుటుంబం రైతు బీమా పథకం లబ్ధి పొందలేకపోయిందని స్థానిక రైతులు ఆరోపించారు. పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వని తహసీల్దార్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతు బాలు మృతదేహంతో శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. నిరసన వ్యక్తం చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ భానుప్రకాశ్ కార్యాలయం నుంచి బయటకు వెళ్తుండగా ఓ రైతు అతనిపై డీజిల్ పోశాడు. పక్కనే ఉన్న సిబ్బంది అప్రమత్తం అవ్వడం వల్ల పెనుప్రమాదం తప్పింది.

ఇదీ చదవండి :Ruia Case: రుయా ఆసుపత్రిలో హత్య కేసు.. సీసీటీవీ ఫుటేజీ విడుదల

ABOUT THE AUTHOR

...view details