అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు 388వ రోజు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, వెంకటపాలెం, అనంతవరం, నెక్కల్లు, బోరుపాలెం, అబ్బరాజుపాలెం గ్రామాల్లో రైతులు నిరసనలు చేపట్టారు. దీక్షా శిబిరాల వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిల్లీలో రైతుల ఆందోళనలు 50 రోజులు పూర్తి కాకుండానే.. కేంద్రం 8 సార్లు చర్చలకు ఆహ్వానించిందన్నారు. రాష్ట్రంలో 388రోజుల నుంచి ధర్నా చేస్తున్నా.. ఒక్కసారైనా ఏ నాయకుడు పలకరించిన పాపాన పోలేదని నిలదీశారు. తమది రాష్ట్ర ప్రజల భవిష్యత్ తరాల కోసం జరుగుతున్న ఆందోళనని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ దీక్షా శిబిరాల వద్దకు వచ్చి సమస్యలపై చర్చించాలని కోరారు.
388 రోజులుగా దీక్ష చేస్తున్నా పట్టించుకోలేదు..
388వ రోజు అమరావతి రైతుల ఆందోళనలు కొనసాగించారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని కొరుతూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
388వ రోజు అమరావతి రైతుల ఆందోళనలు