మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది. పిటిషన్లపై ఐదు గంటలపాటు విచారణ జరిగింది. అనంతరం విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు సీజే జస్టిస్ మహేశ్వరి తెలిపారు. ఎస్‌ఈసీ వ్యాజ్యాలపై పిటిషనర్ తరఫు న్యాయవాదులు ఆదినారాయణ, నారాయణ వాదనలు వినిపించారు. నిమ్మగడ్డ రమేశ్ తొలగింపు రాజ్యాంగ విరుద్ధమని న్యాయవాదులు వాదించారు. కోర్టు ముందు తమ అభ్యంతరాలు తెలిపారు. రేపు మరికొందరు పిటిషనర్ల వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది.
నిమ్మగడ్డ పిటిషన్‌పై విచారణ రేపటి వాయిదా
ఎస్‌ఈసీ పదవీ కాలం కుదింపుపై ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌పై హైకోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఇతరులు వేసిన వ్యాజ్యాలను ధర్మాసనం విచారించింది. సుమారు ఐదు గంటల పాటు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం... విచారణను రేపటికి వాయిదా వేసింది.
నిమ్మగడ్డ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ