వైఎస్ వివేకానంద హత్య కేసు నిందితులు ఎవరో పోలీసులు, సీబీఐ చెప్పాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. ఎవరి ఒత్తిడితో నిజాలను దాస్తున్నారని ప్రశ్నించారు. న్యాయస్థానానికి సమర్పించిన ఛార్జీషీట్ లోని వివరాలను సమర్పించిన వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. రాజకీయ పలుకుబడి ఉంటే ఎలాంటి కేసునైనా సమాధి చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడి కత్తి కేసులో నిందితుడికి ఇప్పటి వరకు బెయిల్ ఇవ్వలేదని ఆక్షేపించారు. బద్వేలు ఉప ఎన్నికలో కాంగ్రెస్ బలం పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందని హర్షకుమార్ ధీమా వ్యక్తం చేశారు.
HARSHA KUMAR : 'ఎవరి ఒత్తిడితో నిజాలను దాస్తున్నారు' - ys viveka murder case
వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు ఎవరో చెప్పాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. బద్వేలు ఉప ఎన్నికలో కాంగ్రెస్ బలం పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందని హర్షకుమార్ ధీమా వ్యక్తం చేశారు.
మాజీ ఎంపీ హర్షకుమార్