ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రతిపక్షాలపై విమర్శలు కాదు... పెట్టుబడులు రాబట్టండి: అమరనాథ్ రెడ్డి

By

Published : Aug 12, 2020, 8:44 PM IST

వైకాపా ప్రభుత్వం తెచ్చిన నూతన పారిశ్రామిక విధానంపై మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి విమర్శలు చేశారు. పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు భరోసా కల్పించేలా పాలసీ లేదని అన్నారు. ప్రోత్సాహకాలు ఇవ్వకుండా పెట్టుబడులు పెట్టాలంటే ఎవరూ ముందుకు రారని చెప్పారు.

మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి
మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి

ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావని మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై నమ్మకం లేకపోతే ప్రవేశపెట్టిన పాలసీలను ఎవరు నమ్ముతారు అని ప్రశ్నించారు. వచ్చిన పరిశ్రమలు వైకాపా నేతల దెబ్బకు పారిపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. సీఎం జగన్ ఇల్లు వదిలి బయటకు వచ్చి మాట్లాడితే పెట్టుబడిదారుల్లో నమ్మకం ఉంటుందన్నారు. కానీ జగన్ ఇల్లు వదిలి బయటకు రారని ఎద్దేవా చేశారు. ఇసుక పాలసీని రద్దు చేసి నిర్మాణ రంగాన్ని కుదేలు చేసినట్లు పారిశ్రామిక రంగాన్ని కూడా చేసేలా ఉన్నారని ధ్వజమెత్తారు.

"పారిశ్రామిక విధానాలు తీసుకువచ్చినప్పుడు... పక్క రాష్ట్రాల కన్నా మెరుగైనవి ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. వైకాపా తెచ్చిన నూతన పారిశ్రామిక విధానంలో అలాంటి చర్యలు కనబడటంలేదు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పోటీపడి పెట్టుబడులు సాధించాలంటే ఆ విధానం సరిపోదు. పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలు తగ్గిస్తే పెట్టుబడులు ఎలా వస్తాయి?. మీ ప్రభుత్వంపై నమ్మకం లేక పెట్టుబడిదారులు పారిపోయే పరిస్థితి వచ్చింది."---అమరనాథ్ రెడ్డి, మాజీ మంత్రి

ABOUT THE AUTHOR

...view details