ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మా అన్నపై కేసు పెట్టించారు.. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో ప్రాణహాని ఉంది' - వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వార్తలు

వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడితో తమ కుటుంబానికి హానీ ఉందంటూ ఓ రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. వరి కొనుగోలు అంశంపై మాట్లాడిన తమ అన్న నరేంద్రపై కేసు నమోదు చేయించారని బాధితుడి సోదరుడు చంద్రబాబు ఆరోపించాడు.

allegations against vinukonda mla bolla brahmanaidu
allegations against vinukonda mla bolla brahmanaidu

By

Published : Jan 8, 2022, 9:54 PM IST

రైతు నరేంద్రను తీసుకెళ్తున్న పోలీసులు

వడ్లు కొనాలని అడిగినందుకు తమ అన్నపై పోలీసుల చేత వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హత్యాయత్నం కేసు నమోదు చేయించారని రైతు సోదరుడు చంద్రబాబు ఆరోపించాడు. గురువారం గుంటూరు జిల్లా వేల్పూరు గ్రామానికి వచ్చిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుని.. ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయించాలని.. ఇతర రైతులతో కలిసి నరేంద్ర కోరారని అతని సోదరుడు చంద్రబాబు తెలిపారు. కొనుగోలు అంశంపై ఉన్నతాధికారులతో మాట్లాడతామని ఎంపీ చెప్పారని.. అదే సమయంలో పక్కనే ఉన్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఒక్కసారిగా ఆగ్రహంతో.. తన అన్నపై దూషణకు దిగారని చెప్పారు. ఇదేమిటని ప్రశ్నించిన తన అన్నను.. భద్రతా సిబ్బందితో పక్కకు తోసేశారన్నారు. తర్వాత వినుకొండ పోలీసులు స్టేషన్‌కి తరలించారని తెలిపారు.

రెండ్రోజుల పాటు వినుకొండ, శావల్యాపురం ఠాణాలకు తిప్పి.. శనివారం ఉదయం కోర్టుకు తీసుకొచ్చారని చెప్పారు. ఎమ్మెల్యే పీఏతో పాటు అంజి అనే మరో వ్యక్తితో..హత్యాయత్నం కేసు పెట్టించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని.. బాధితుడి సోదరుడు చంద్రబాబు ఆరోపించాడు. నరేంద్రకు కరోనా పరీక్షలు నిర్వహించాలని న్యాయమూర్తి ఆదేశించడంతో.. కోర్టు ప్రాంగణంలో పరీక్ష పూర్తి చేశారు. మీడియాతో మాట్లాడకుండా అడ్డుకుని తరలించారు.

ABOUT THE AUTHOR

...view details