ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతి ఉద్యమ పోరులో ప్రాణాలు విడిచిన మరో రైతు - అమరావతి రాజధానిలో మరో రైతు మృతి

అమరావతి రాజధానిలో మరో రైతు మృతి చెందారు. తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన షేక్ కరీముల్లా.. ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. దీంతో తోటి రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. నీ త్యాగం వృథా కానివ్వబోమని తేల్చిచెప్పారు.

Farmer dies at Amravati capital
అమరావతి ఉద్యమ పోరులో ప్రాణాలు విడిచిన మరో రైతు

By

Published : Jan 22, 2021, 10:25 AM IST

Updated : Jan 22, 2021, 4:20 PM IST

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఉద్యమం చేస్తున్న మరో రైతు ప్రాణాలు కోల్పోయారు. తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన షేక్ కరీముల్లా.. ఈ రోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. అమరావతి నిర్మాణానికి షేక్ కరిముల్లా 46 సెంట్లు పొలం ఇచ్చారు. మూడు రాజధానుల ప్రకటన వచ్చిన దగ్గర్నుంచి ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. 400 రోజులుగా నిర్వహించిన ర్యాలీలో కరిముల్లా ఉత్సాహంగా పాల్గొన్నారు. గురువారం సైతం ధర్నాలో పాల్గొన్న ఆయన మృతితో తోటి రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. కరిముల్లా
త్యాగం వృథా కానివ్వబోమని రైతులు తేల్చిచెప్పారు.

Last Updated : Jan 22, 2021, 4:20 PM IST

ABOUT THE AUTHOR

...view details