ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Nori meet KTR: కేటీఆర్​తో ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు భేటీ - మంత్రి కేటీఆర్​తో నోరి దత్తాత్రేయుడు

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్యాన్సర్ చికిత్స నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు( doctor nori) తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను(minister KTR) కలిశారు. ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన రాష్ట్ర వైద్య విధానాలను ప్రశంసించారు. రాష్ట్రానికి తిరిగి మరిన్ని సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటానని మంత్రికి వివరించారు.

famous-oncologist-nori-dattatreyudu-meet-with-minister-ktr-at-pragathi-bhavan
కేటీఆర్​తో ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు భేటీ

By

Published : Sep 22, 2021, 5:19 PM IST

తెలంగాణ ఏర్పడిన తర్వాత సాధిస్తున్న ప్రగతి, చేపట్టిన కార్యక్రమాలను ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణుడు నోరి దత్తాత్రేయుడు(Nori dattatreyyudu) ప్రశంసించారు. ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్​ (Minister KTR)ను మర్యాదపూర్వకంగా ఆయన ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల వైద్య కార్యక్రమాలకు.. ప్రధానంగా క్యాన్సర్ సంబంధిత చికిత్సకు తన మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రికి వివరించారు. తన వైద్య విద్య, వృత్తి హైదరాబాద్‌లోనే ప్రారంభమైందన్న నోరి దత్తాత్రేయుడు.. రాష్ట్రానికి తిరిగి మరిన్ని సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు.

దశాబ్దాల పాటు లక్షలాది మందికి అద్భుతమైన వైద్య సేవలు అందించిన నోరి దత్తాత్రేయుడిని కలవడం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. వైద్య రంగంలో, ముఖ్యంగా క్యాన్సర్ చికిత్స విధానంలో వివిధ దేశాలు అనుసరిస్తున్న పద్దతులపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో చేపట్టిన వినూత్న కార్యక్రమాలను మంత్రి వివరించారు. కరోనా సంక్షోభం తర్వాత అన్ని ప్రభుత్వాలు ఆరోగ్య రంగంలో భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసేందుకు సుముఖంగా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) కూడా ప్రభుత్వ అరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు వివిధ కార్యక్రమాలను ప్రారంభించారని నోరి దత్తాత్రేయుడికి కేటీఆర్ వివరించారు.

ఇదీ చూడండి:కాకినాడ మేయర్ పావని ఇంటి వద్ద అపరిచితుల సంచారం

ABOUT THE AUTHOR

...view details