Suspected death: హైదరాబాద్‌లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్నానాల గదిలో ప్రత్యూష మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఆమె నివాసముంటోంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సూసైడ్ లేఖ లభ్యం: ఆత్మహత్యకు ముందు లేఖ ప్రత్యూష రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాను కోరుకున్న జీవితం ఇది కాదని ఆమె లేఖలో రాసినట్లు వెల్లడించారు. ఒంటరి జీవితంతో విరక్తి చెందినట్లు లేఖలో పేర్కొన్నారు. తల్లిదండ్రులకు భారం కాలేనని లేఖలో వాపోయింది. తనను క్షమించాలని ఆత్మహత్య లేఖలో ప్రత్యూష పేర్కొంది.
ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్‌ను పోలీసులు గుర్తించారు. కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ప్రత్యూష ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్నానాల గదిలో కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. చలనచిత్ర రంగంలో ప్రముఖులకు ఫ్యాషన్ డిజైనర్‌గా ప్రత్యూష పనిచేసింది. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.