Gautham menon Interview: 'బతుకమ్మ పాట' రూపొందించాలని గౌతమ్ మీనన్‌కు ఎందుకనిపించిందంటే..? - అమరావతి వార్తలు
ఈ ఏడాది మన బతుకమ్మ(saddula Bathukamma Song 2021) పాటకు అంతర్జాతీయ గుర్తింపు రానుంది. ప్రతి సంవత్సరం మాదిరి ఈ ఏడు కూడా చాలామంది బతుకమ్మ పాటలు రూపొందించారు. అందులో అందరూ ఆసక్తికరంగా ఎదురుచూసేది మాత్రం ఒక పాట కోసం. ఎందుకు ఆ పాటకు అంత ప్రాముఖ్యత ఎందుకంటే.. ఆ గీతాన్ని రూపొందించింది సాధారణ వ్యక్తులు కాదు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఈ ఇద్దరి కలిసి ఈయేడు ఓ బతుకమ్మ పాటను రూపొందించారు. ఈ పాటను ప్రముఖ గాయని పాడారు. ఇటీవల హైదరాబాద్ సమీపంలోని భూదాన్ పోచంపల్లిలో చిత్రీకరణ జరిపారు. రాష్ట్రంలో ఈనెల 6 నుంచి బతుకమ్మ పండుగ(saddula Bathukamma Song 2021) ప్రారంభం కానుంది. ఆ లోపే పాటను విడుదల చేస్తారు. ఈ గీతాన్ని ఇతర భాషల్లోకి సైతం అనువదించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రేమ చిత్రాలకు ప్రాణం పోయడంలో సిద్ధహస్తుడైన గౌతమ్‌మీనన్... రూపొందించిన బతుకమ్మ పాట ఎలా ఉండబోతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. అసలు బతుకమ్మ పాటను రూపొందించడానికి ఆయనకు ప్రేరణ ఎలా వచ్చింది. పాట చిత్రీకరణ ఎలా జరిగింది.. మరిన్ని విశేషాలు ఆయన మాటల్లోనే..
goutam menon
..