family suicide in nizamabad: నిజామాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని ఒక హోటల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదిలాబాద్‌కు చెందిన కొత్తకోట సూర్యప్రకాశ్ అనే వ్యక్తి... రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. భార్య ప్రత్యూష, ఇద్దరు పిల్లలతో.. 15 రోజులుగా నిజామాబాద్‌లోని హోటల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇవాళ నలుగురు హోటల్ గదిలో విగతజీవులుగా కనిపించారు.
నిజామాబాద్‌లో ఇద్దరు పిల్లలు సహా దంపతుల ఆత్మహత్య - ఆంధ్రప్రదేశ్ నేర వార్తలు
family suicide తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ హోటల్లో ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. భార్య, పిల్లలకు పురుగుల మందు తాగించి తరువాత, సుర్యప్రకాశ్ ఉరి వేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
suicide
భార్య, పిల్లలు పురుగుల మందు తాగి చనిపోగా.. సూర్యప్రకాశ్ ఉరి వేసుకుని చనిపోయినట్లుగా గుర్తించారు. మొదట భార్య, పిల్లలకు పురుగుల మందు తాగించిన సూర్యప్రకాశ్.. అనంతరం ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సూర్యప్రకాశ్ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దృష్టి పెట్టారు.
ఇవీ చదవండి: