ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

FAKE FB ACCOUNT: ఆ కేటుగాళ్లు చివరికి సీఎం సీపీఆర్వోనూ వదల్లేదుగా..? - క్రైమ్ వార్తలు

సైబర్ నేరగాళ్ల(Cyber crimes) ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వారిని పట్టుకునేందుకు పోలీసులు నయా పంథాల్లో ప్రయత్నిస్తుంటే.. తప్పించుకోవడానికి కొత్త రూట్లు వెతుక్కుంటున్నారు. ఈ కేటుగాళ్ల అరాచకాలతో ఎంతో మంది అమాయకులు మోసపోతున్నారు. కొన్నిసార్లు ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలు తీసుకుంటున్నారు.

FAKE FB ACCOUNT
FAKE FB ACCOUNT

By

Published : Oct 2, 2021, 4:48 PM IST

సైబర్ నేరాల(Cyber crimes)లో తాజాగా నకిలీ ఫేస్​బుక్ ఖాతాల(Fake Facebook Account) ట్రెండ్ నడుస్తోంది. ఫేక్ ప్రొఫెల్ క్రియేట్ చేసి రకరకాల మోసాల(Cyber crimes)కు పాల్పడుతున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సీపీఆర్వో పేరుతో నకిలీ ఫేస్​బుక్ ఖాతా(Fake Facebook Account) ఉండటం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఖాతా(Fake Facebook Account)తో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి డబ్బులు డిమాండ్ చేశారు. సీఎం సీపీఆర్వో జ్వాల నర్సింహరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎవరైనా తమకు ఫేస్​బుక్​(Fake Facebook Account)లో చాట్ చేస్తూ డబ్బులు అడిగితే.. వారి వలలో పడకూడదని పోలీసులు అన్నారు. ఒకవేళ తెలిసిన వారే అడిగితే డైరెక్ట్​గా వాళ్లకు ఫోన్ చేసి విషయం తెలుసుకుని అప్పుడే నగదు ఇవ్వండని చెబుతున్నారు. తెలియని వాళ్లు, కొత్తగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిన వాళ్లు డబ్బడిగితే అది అనుమానించాల్సిన విషయమని.. వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details