ఆమె మాత్రమే కాదు.. నిమ్స్‌కు మూత్రపిండాల వైఫల్యంతో వస్తున్న వారిలో 10 - 15 శాతం కేసులు ఈ తరహావే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. నిపుణులైన వైద్యుల సూచనలు లేకుండా నొప్పి నివారణ, యాంటాసిడ్ మందులు వాడటం చాలా ప్రమాదకరమని సూచిస్తున్నారు. అరకొర జ్ఞానంతో సేవలు అందించే ఆర్‌ఎంపీలు, నకిలీ వైద్యుల ప్రభావం ఇప్పుడు నగరంపై కూడా పడుతోంది. తాజాగా సంఘటనలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.
హైదరాబాద్‌ను నకిలీ వైద్యులు ఠారెత్తిస్తున్నారు. కొందరు ఎంబీబీఎస్ డిగ్రీలే కాదు..స్పెషలైజన్స్ డిగ్రీలు పెట్టుకొని దర్జాగా వైద్య సేవలు అందిస్తున్నారు. దాదాపు వందమందితో కూడిన నకిలీ వైద్యుల జాబితాను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేయడం ఇటీవల సంచలనం సృష్టించింది. ఎలాంటి ఎంబీబీఎస్ డిగ్రీ లేకున్నా సరే.. వివిధ ఆసుపత్రుల్లో పనిచేసిన కొద్దిపాటి అనుభవంతో ఏకంగా క్లినిక్‌లను తెరిచి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనం బయటపడింది. వారం రోజుల క్రితం కొవిడ్ రోగికి వైద్యం పేరుతో ఏవో చికిత్సలు చేసి చివరికి అతని ప్రాణాలు కోల్పోవటానికి కారణం కావడంతో పోలీసులు వైద్యుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. అక్కడ నుంచి తీగలాగితే నకిలీ వైద్యుల డొంక కదలింది.
ఎలా చేస్తున్నారు?
* నగరంలోని చిన్న చిన్న బస్తీలు, గల్లీలు, కాలనీలే అడ్డాలుగా క్లినిక్‌లు తెరిచి ఇలాంటి వారు వైద్య సేవలు అందిస్తున్నారు.
* తొలుత చిన్న చిన్న సమస్యలకు ప్రాథమిక వైద్యం అందించి రోగుల్లో నమ్మకం కల్పిస్తున్నారు.
*పది రకాల మందుల గురించి తెలుసుకొని లక్షణాలు బట్టి అవే రోగులకు అందిస్తుంటారు.
* యాంటీ బయోటిక్స్, పెయిన్ క్లిల్లర్స్ లాంటి మందులతో తాత్కాలికంగా ఉపశమనం దొరుకుతుండటంతో చాలామంది వీటినే ఆశ్రయిస్తున్నారు. అంతేకాక తక్కువ ఫీజు కూడా ఒక కారణం.
రుజువైతే ఏడేళ్లు శిక్ష