పిల్లల్లో కరోనాను ఎలా గుర్తించాలి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? - corona to children
ప్రపంచానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి నుంచి పిల్లలను కాపాడుకోవటంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ పిడియాట్రీషియన్ డాక్టర్ దినేశ్ తెలిపారు. కుటుంబ సభ్యుల నుంచే పిల్లలకు వైరస్ సోకే అవకాశముంటుందని.. అందుకే నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. కొవిడ్ బారిన పడిన వారిలో చిన్నారులే ఎక్కువ సంఖ్యలో కోలుకుంటున్నట్లు చెప్పారు. పిల్లల్లో లక్షణాలు త్వరగా గుర్తించే అవకాశమున్నందున.. సత్వరమే ఆస్పత్రికి తీసుకెళ్లాలని తెలిపారు. కరోనా దృష్ట్యా చిన్నారుల ఆరోగ్య సంరక్షణపై ఏమరపాటు తగదంటున్న డాక్టర్ దినేశ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
పిల్లలకు కరోనా వ్యాప్తిపై మాట్లాడుతున్న పిడియాట్రీషియన్ డాక్టర్ దినేశ్